డేటింగ్ వార్తలపై కియారా కామెంట్.. అభిమానుల ఫ్యూజులు ఎగిరిపోయాయి!

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’, రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తున్నట్లుగా కొంతకాలంగా వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఇంతకాలం ఈ బ్యూటీ, ఆ వార్తలను ఎప్పుడూ ఖండించలేదు.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’, రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఈ బ్యూటీకి ఇక్కడ ఎంత మంచి పేరుందో, బాలీవుడ్‌లో తరుచూ ఏదో ఒక వివాదంలో అమ్మడి పేరు వినిపిస్తూ ఉంటుంది.

అక్కడ హీరోహీరోయిన్ల డేటింగ్ విషయాలను బాలీవుడ్ మీడియా ఎప్పుటికప్పుడు అభిమానులకు చెబుతూ ఉంటుంది. గతకొంత కాలంగా కియారా విషయంలోనూ ఇదే జరుగుతోంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తున్నట్లుగా కొంతకాలంగా వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఇంతకాలం ఈ బ్యూటీ, ఆ వార్తలను ఎప్పుడూ ఖండించలేదు. కానీ, తాజాగా సిద్ధార్థ్‌తో తన ప్రేమ వ్యవహారంపై ఈ బ్యూటీ ఓపెన్ అయ్యింది.

ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో కియారా సిద్ధార్థ్‌తో తన రిలేషన్ ఏమిటనేది చెప్పేసింది. తాను, సిద్ధార్థ్ మంచి స్నేహితులం మాత్రమే.. తామిద్దరి మధ్య అంతకు మించి ఎలాంటి సంబంధం లేదని అమ్మడు కుండ బద్దలు కొట్టేసింది. అయితే సిద్ధార్థ్‌తో కియారా నిజంగానే రిలేషన్‌లో ఉందని భావించిన అభిమానులకు, ఇది షాకింగ్ విషయమే అని చెప్పాలి. వారు అమ్మడి నుంచి ఇలాంటి రెస్పాన్స్‌ను అస్సలు ఊహించలేదు. ఏదేమైనా కియారా కామెంట్‌తో ఆమె అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.