పూజా కార్యక్రమాలతో మొదలైన పుష్ప 2.. బన్నీ డుమ్మా..!

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ గెటప్ లో కనిపించాడు. చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగులు, ఆయన యాటిట్యూడ్ సినిమాకే హైలైట్. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకోవడమే కాదు కాసుల వర్షం కురిపించింది.

పుష్ప చిత్రానికి సీక్వెల్ ఉంటుందని సుకుమార్ ఎప్పుడో ప్రకటించాడు. అయితే సినిమా విడుదలై చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇంకా సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లలేదు. ఎట్టకేలకు ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో మొదలైంది. అల్లు అర్జున్ ప్రస్తుతం యూఎస్‌లో ఉన్నందున హాజరు కాలేదు. మరి కొద్ది రోజులలో తిరిగి రానుండగా, వచ్చిన వెంటనే సెట్స్‌లో అడుగుపెట్ట నున్నాడు.ఇక పుష్ప సినిమాలో విలన్ గా మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ నటించిన విషయం తెలిసిందే. సెకండ్ పార్ట్ లోనూ ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తిగా ఉండేలా డిజైన్ చేశారట సుకుమార్. మరి ఈ సీక్వెల్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాను రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు ఆ మధ్య టాక్‌ వినిపించింది.

కొద్ది రోజులుగా చాలా వర్క్ చేశాడు. ఇక తన శిష్యుడు బుచ్చిబాబు సాయం కూడా తీసుకున్నాడనే టాక్ వినిపించింది. మొదటి పార్ట్ మించి ఉండేలా సెకండ్ పార్ట్ చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో కొత్త నటీనటులు కూడా చేరబోతున్నట్టు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.