మరోసారి యాంటీ ఫ్యాన్స్ కి మాస్ వార్నింగ్ ఇచ్చిన నాగబాబు!

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లో ఉన్న హైటెక్స్‌లో నిన్న రాత్రి గ్రాండ్ గా ఓ ఈవెంట్ ను నిర్వహించారు. మెగాస్టార్ కార్నివాల్ పేరుతో ఈ ఈవెంట్‌ చాలా ఘనంగా జరిగింది.

మెగా అభిమానులతో పాటు మెగా హీరోలు కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు ఇచ్చిన స్పీచ్ మరోసారి వార్తల్లో నిలిచింది. చాలా అగ్రెసివ్ గా ఆయన ఈ స్పీచ్ ఇచ్చారు. నాగబాబు మాట్లాడుతూ.. ‘1976వ సంవత్సరంలో తను 21 సంవత్సరాల కుర్రాడు.

తనకంటూ సినీ పరిశ్రమలో ఓ ముద్ర వేసుకోవాలని.. తనకంటూ గుర్తింపు ఉండాలని నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఈ రోజు మహా సామ్రాజ్యాన్ని స్థాపించడం అంటే మామూలు విషయం కాదు. మా ఇద్దరిది 62 ఏళ్ల అనుబంధం. మా అన్నయ్య గురించి నాకంటే ఇండస్ట్రీలో ఎక్కువగా చెప్పేవారు లేరు. మా అన్నయ్య బర్త్ డే అంటే మా ఇంట్లో ఎంతో స్పెషల్ డే. మా అమ్మ చిరంజీవి గారి పుట్టినరోజును ఎప్పుడు ప్రత్యేకంగా చేసేవారు. అన్నయ్య ఇప్పుడు అందరికీ హీరో కావొచ్చు. కానీ నాకు చిన్నప్పటి నుంచే హీరో.

ఆయనకు చిన్నప్పటి నుంచి ఫాలోయింగ్ ఉంది.ఆయన సామ్రాజ్యం ఎంతలా విస్తరించిందంటే.. ఒక తమ్ముడికి నిర్మాతగా జీవితాన్ని ఇచ్చి నిలబెట్టాడు.. అది నేను. ఇంకొక తమ్ముడు పవన్ కళ్యాణ్. అతను నిరంతరం ఆలోచనవాది. పవన్ కళ్యాణ్ డైరెక్టర్‌ అవుదామని అనుకున్నాడు. అయితే ‘దర్శకత్వం తర్వాత చేయొచ్చు.. నీలో స్పార్క్ ఉంది.. నువ్వు ముందు హీరో అవ్వు..’ అని అన్నయ్య కళ్యాణ్ బాబుతో చెప్పారు. అన్నయ్య మాటను ఒప్పుకుని ఈరోజు పవర్ స్టార్‌గా ఎదిగాడు. రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి జనసేనాని. త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ చరిత్రను మార్చే దమ్మున్న వ్యక్తి. అంత గొప్ప వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి.

బన్నీ, చరణ్, వరుణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్, నిహారిక, శిరీష్… వీరందరికీ బంగారు భవిష్యత్తు ఇచ్చాడు. మా అన్నయ్య రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము. ఆయన ఎంత మంచి వాడో నాకు తెలుసు.ఆయన ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు అయినా కొంతమంది విమర్శిస్తుంటారు. మా అన్నయ్యను,అలాగే నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను కూడా విమర్శిస్తూ ఉంటారు. ఎవరు విమర్శించినా నేను గట్టిగా కౌంటర్ ఇస్తాను. అందుకు నన్ను కాంట్రవర్సియల్ పర్సన్ అంటున్నారు. మీరు ఏమనుకున్నా పర్వాలేదు.. నా అన్నను.. తమ్ముడిని ఎవడైనా ఏదైనా అంటే తాటతీస్తా.. అందులో ఏ డౌట్ లేదు..’ అంటూ నాగబాబు యాంటీ ఫ్యాన్స్ కు, మెగా ఫ్యామిలీని విమర్శించే వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.