కుమారుడు రామ్ చరణ్ పై చిరంజీవి భావోద్వేగ ట్వీట్

ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ట్రూ లెజెండ్ అవార్డును మెగా హీరో రామ్ చరణ్ అందుకున్నాడు. వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందిస్తున్న వ్యక్తులకు ఓ జాతీయ మీడియా సంస్థ ఈ అవార్డులను అందిస్తోంది. ఎంటర్టయిన్ మెంట్ రంగంలో రామ్ చరణ్ ట్రూ లెజెండ్ అవార్డును అందుకున్నాడు.

ఈ నేపథ్యంలో తన కుమారుడి అచీవ్ మెంట్ పట్ల చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా భావోద్వేగంతో స్పందించారు. ‘నాన్నా… ట్రూ లెజెండ్  అవార్డును గెలుచుకున్న నిన్ను చూసి చాలా గర్విస్తున్నా. ఇలాగే ముందుకు సాగిపోవాలని అమ్మ, నేను కోరుకుంటున్నాం’ అని ట్వీట్ చేశారు. చరణ్ పిల్లవాడిగా ఉన్నప్పటి ఫొటోను షేర్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.