అబద్ధాలతో రైతులను తప్పుదోవ పట్టించే యత్నం

మోటార్లకు మీ టర్లు అంటూ కేసీఆర్‌ ‌ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విమర్శించారు. మోటార్లకు మీ టర్లు పెట్టాల్సిన అవసరం లేదని కేంద్రం చేసిన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. కేసీఆర్‌ ‌చెప్పేటివన్నీ అబద్ధాలని..కేసీఆర్‌ ఆలోచన వెనుక పెద్ద కుట్ర దాగివుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పు‌డూ నిజం చెప్పరు, నోరు విప్పితే అబద్ధాలే చెబుతారని బండి సంజయ్‌ అన్నారు. భాజపా వొస్తే మీ టర్లు పెడతారని కేసీఆర్‌ ‌బెదిరిస్తున్నారని మండిపడ్డారు. మోటార్లకు మీ టర్లు అక్కర్లేదని నిరూపిస్తామని సంజయ్‌ ‌పేర్కొన్నారు. రైతుల్ని భాజపా ఇబ్బంది పెడుతున్నట్లు ఆధారాలు చూపించగలరా అని ప్రశ్నించారు. మోటార్లకు మీ టర్లు పెడుతారంటూ కేసీఆర్‌ ఆరోపణల వెనుక కుట్ర ఉందని బండి సంజయ్‌ ‌ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్‌ ఇవ్వడం కేసీఆర్‌కు చేతకావట్లేదు..రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది..ప్రభుత్వం దగ్గర పైసల్లేవు అని బండి సంజయ్‌ ‌వ్యాఖ్యానించారు. విద్యుత్‌ ‌సంస్థల వద్ద రూ.50 వేల కోట్లు అప్పు చేశారు..అప్పు తీర్చకపోతే రాష్ట్రంలో డిస్కమ్‌లన్నీ కుప్పకూలే పరిస్థితి ఏర్పడిందని సంజయ్‌ ‌పేర్కొన్నారు.

దీనిని కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ అధికారంలోకి వొస్తే బాయికాడ మీ టర్లు పెడ్తరని రైతులను కేసీఆర్‌ ‌తప్పదోవ పట్టిస్తున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులను ఇబ్బంది పెడుతున్నట్టు కేసీఆర్‌ ‌నిరూపించగలడా అని ప్రశ్నించారు. ఉచిత కరెంట్‌ ఇవ్వడం కేసీఆర్‌కు చేతగావడం లేదని బండి సంజయ్‌ ‌విమర్శించారు. కరెంట్‌ ‌ఛార్జీలు పెంచి ప్రజలపై ప్రభుత్వం భారం మోపుతుందని మండిపడ్డారు. కరెంట్‌ ‌కొనుగోలు పేరుతో రాష్ట్రంలోని విద్యుత్‌ ‌సంస్థల వద్ద 50 వేల కోట్ల అప్పు చేశారని..ఇప్పుడా అప్పు తీర్చకపోతే రాష్ట్రంలోని డిస్కమ్‌లన్నీ కుప్పకూలే పరిస్థితి ఏర్పడిందన్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌కేంద్రంపై విషప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోలేదన్నారు. ప్రజలను అరిగోస పెడుతూ..రాష్ట్రాన్ని దివాలా తీయించిన కేసీఆర్‌ ‌పాలనపై పోరాడాల్సిన కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు పూర్తిగా దిగజారిపోయారని ఆరోపించారు. కమ్యూనిస్టులు ఎర్రగులాబీలుగా మారి కేసీఆర్‌ ‌చంకన చేరారని విమర్శించారు.

లిక్కర్‌ ‌స్కామ్‌ను డైవర్ట్ ‌చేసే కుట్ర…అమిత్‌ ‌షాకు చెప్పులు తీసిస్తే తప్పేముంది
కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా పెద్దమనిషి..ఆయనకు చెప్పులు తీసిస్తే తప్పేముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. దీనిని పెద్దగా చిత్రీకరిస్తూ తెలంగాణ ఆత్మగౌరవం అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. నిజానికి లిక్కర్‌ ఇష్యూను డైవర్ట్ ‌చేసేందుకే షాకు చెప్పులు ఇచ్చింది ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు, ఎంఐఎం గూండాలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఎవరూ వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బిజినెస్‌ ‌మెన్లు ఇక్కడ వ్యాపారాలు చేయాలంటే భయపడుతున్నారన్నారు. ఒకవేళ బిజినెస్‌ ‌చేస్తే కేసీఆర్‌ ‌కుటుంబానికి వాటాలు, కమీషన్లు ఇవ్వాల్సి వొస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ ‌ది మేకపోతు గాంభీర్యం అని ..టీఆర్‌ఎస్‌  ‌ప్రభుత్వానికి చమరగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో ముమ్మాటికి  సీఎం కేసీఆర్‌ ‌ప్రమేయం ఉందని బండి సంజయ్‌ ఆరోపించారు. అందుకే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై ఆరోపణలు వొస్తున్నాయన్నారు. పంజాబ్‌లో లిక్కర్‌ ‌సిండికేట్‌ ‌చేసేందుకు కేసీఆర్‌ ఆ ‌రాష్ట్రానికి వెళ్లినట్టుగా అనుమానం వొస్తుందన్నారు. దిల్లీ ఒబేరాయ్‌ ‌హోటల్‌లో ఏం జరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యులు లిక్కర్‌ ‌మాఫియాకు సంబంధించిన వ్యక్తులను కలిశారా లేదా అని ప్రశ్నించారు. లిక్కర్‌ ‌మాఫియా ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ ‌నుంచి దిల్లీకి వెళ్లింది నిజం కాదా అని నిలదీశారు. లిక్కర్‌ ‌మాఫియాలో కాంగ్రెస్‌ ‌వ్యక్తుల కూడా ఉన్నట్లు తెలుస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌కలిసే లిక్కర్‌ ‌దందా చేస్తున్నారన్నారు. లిక్కర్‌ ‌స్కామ్‌పై సమగ్ర విచారణ జరిపితే నిజాలు బయటపడతాయన్నారు. లిక్కర్‌ ‌మాఫియాతో  కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యులకు బినామీ లు అయినా రామచంద్ర పిల్ళై, శరత్‌, ‌సృజన్‌ ‌రెడ్డి, అభిషేక్‌ ‌లతో సంబంధాలు ఉన్నాయా లేవా అని బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు. ఈ విషయంపై స్పందించేందుకు మంత్రి కేటీఆర్‌ ఎక్కడికి పోయారని..ఆయన ఎందుకు ట్వీట్‌ ‌చేయలేదన్నారు. దీనిపై తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.

కెసిఆర్‌ ‌కుటుంబానికి ఇడి విచారణ తప్పదన్న బిజెపి నేత మురళీధర్‌ ‌రావు
కేసీఆర్‌ ‌కుటుంబం ఈడీ విచారణకు సిద్ధంగా ఉండాలని బీజేపీ నేత మురళీధర్‌ ‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు చేసిన అవినీతి అక్రమాలపై విచరణ తప్పదని అన్నారు. ఇది తెలిసే సిఎం కెసిఆర్‌ ‌పదేపదే ఇడి బెదిరింపులు అంటూ మాట్లాడుతున్నారని మండి పడ్డారు. సోమవారం ఆయన మాట్లాడుతూ… చేసిన అవినీతి నుంచి కేసీఆర్‌ ‌కుటుంబం తప్పించుకోలేదన్నారు. దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కవిత పాత్ర ఏంటనేది విచారణలో తేలుతుందని అన్నారు. తప్పును కప్పిపుచ్చుకోవటానికి కవిత బీజేపీపై ఆరోపణలు చేయటం తగదన్నారు. అమిత్‌ ‌షా, జూ ఎన్టీఆర్‌ ‌భేటీపై..మాట్లాడుతూ భవిష్యత్‌లో ఏమైనా జరగొచ్చని చెప్పుకొచ్చారు. అమిత్‌ ‌షా, జూ ఎన్టీఆర్‌ ‌మధ్య భేటీలో రాజకీయ పరమైన అంశాలు కూడా చర్చకు వొచ్చి ఉండవచ్చన్నారు. రజాకార్ల ఫైల్స్ ‌సినిమా రావాలని ప్రతి హిందువు కోరుకుంటున్నారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను మార్చబోతుందని మురళీధర్‌ ‌రావు పేర్కొన్నారు. ఇక్కడ బిజెపి గెలుపును ఎవ్వరూ ఆపలేరని అన్నారు. ప్రజలు టిఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. కెసిఆర్‌ ‌కుటుంబ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయి ఉన్నారని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.