తెలంగాణలో అమరుల ఆకాంక్షలు నెరవేరలేదు….!

తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేరలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. శనివారం ప్రజా సంగ్రామ యాత్ర పొడిచేడు మోత్కూర్‌ ‌గ్రామాలకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరవీరుడు శ్రీకాంత్‌ ‌చారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయా గ్రామాల్లో జండా ఆవిష్కరణ చేసి వృద్ధులను చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. ఈ యాత్రలో సినీనటి జీవిత రాజశేఖర్‌ ‌పాల్గొన్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగానే అమరుల త్యాగాలను వృథా కానివ్వమని,అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీని ఇచ్చారు. అమరవీరుల ఆకాంక్ష్యాగాలకు భిన్నంగా రాష్ట్రంలో కెసిఆర్‌ ‌మూర?పు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కెసిఆర్‌ ‌రాచరిక నయా నిజాం పాలన చూసి అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకుడు పిడమర్తి నాగరాజు ప్రగతి భవన్‌ ‌కు వెళ్లి కేసీఆర్‌ ‌కలిసి పరిస్థితి లేదని అన్నారు.

ఏ ఒక్క ఉద్యమకారుడికి కేసీఆర్‌ ‌న్యాయం చేయలేదని ఎద్దేవ చేశారు. గొప్ప చదువులు చదివి ఎంబీఏ ఎంసీఏ పిహెచ్డీలు చేసిన వాళ్లు ఉద్యోగాలు రాక గోర్లు కాసుకునే పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందని విమర్శించారు. అమరవీరుల ఆశయాలను సాధించేంతవరకు బిజెపి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కవులు కళాకారులు మేధావి వర్గంతో పాటు ఉద్యమకారులంతా బిజెపిలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కెసిఆర్‌ ‌కుటుంబ అవినీతి నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. బిజెపి చేసే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలంగాణలో ఇదే చివరి ఉద్యమం కావాలని ఆయన ఆకాంక్షించారు.  చిన్నారి కోరిక మేరకు ఇంటి వద్దకు వెళ్లి సెల్ఫీ దిగి వారి కుటుంబానికి సంతోషాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి బంగారు శృతి, యాదాద్రి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్‌ ‌రావు, రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మొగులయ్య, వీరెల్లి చంద్రశేఖర్‌, ‌గోంగిడి మనోహర్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.